హాస్యనటి బిందు ఘోష్ చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతి చెందారు. ఇవాళ ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హాస్య నటి బిందు ఘోష్ వృద్ధాప్యంలో పలు రకాల సమస్యలతో ఆనారోగ్యానికి గురయ్యారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఆమె చికిత్సకు సహాయం చేశారు. బిందు ఘోష్ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
హాస్యనటి బిందు ఘోష్ కన్నుమూత
March 18, 2025
0
Tags