అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు !

Telugu Lo Computer
0


మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, పైజామాను కిందకి లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడాని ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. ఈ తీర్పు పూర్తి అసమర్థత కూడినదంటూ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది తీవ్రమైన విషయమని, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి వైపు పూర్తి అసమర్థత కనిపిస్తుందని జస్టిస్ బీఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇది పూర్తి సున్నితత్వం కూడిందని, ఈ విషయాన్ని చెప్పడానికే తమకు బాధగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంపై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి సమాధానాలను కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)