చెన్నైలో ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాఫర్ గులాం హుస్సేన్ హతం !

Telugu Lo Computer
0


చెన్నైలో జరిగిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాఫర్ గులాం హుస్సేన్ హతమయ్యాడు. మంగళవారం చెన్నై ఎయిర్ పోర్టులో గులాం హుస్సేన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా నగలు దాచిన చోటు చూపిస్తానంటూ పోలీసులను జాఫర్ బయటకు తీసుకెళ్లాడు. సంఘటనాస్థలికి వెళ్తుండగా మార్గమధ్యలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో జాఫర్ పై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. తరమణి సమీపంలో పోలీసుల కాల్పుల్లో జాఫర్ గులాం హుస్సేన్ హతమయ్యాడు. జాఫర్ గ్యాంగ్ చెన్నైలో వరుస చైన్ స్నాచింగ్ లు పాల్పడుతోంది. సోమవారం ఒక్కరోజే ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ఈ ఘటనలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. చైన్ స్నాచర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగానే జాఫర్ ను పోలీసులు మట్టుబెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)