ఆంధ్రప్రదేశ్ లోని తూ ర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గామన్ బ్రిడ్జి రహదారిపై కొంత మూరు నయారా పెట్రోల్ బంకు వద్ద సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ మంగళవారం విలేకర్లకు తెలిపారు. హైద రాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీఎహెచ్ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్ (46) అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై వెనుక లగేజీ బ్యాగ్ కట్టుకుని సోమవారం రాత్రి రాజమహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని, భార్య కు చెప్పి బుల్లెట్‌పై బయలుదేరినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమవారం అర్ధరాత్రి కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి మోటార్ సైకిల్ అదుపుతప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతానికి పడిపోవడంతో మోటార్ సైకిల్ ప్రవీణ్‌కుమార్‌పై పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మర్నాడు ఉదయం వరకు ఎవరూ గమనించలేదు. మంగళవారం ఉదయం తమకు వచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించామని, బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్ రహదారి పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్ ఆయనపై పడిపోవడంతో మృతి చెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృ త దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమ హేం ద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించామ న్నారు. ఎస్‌ఐ మనోహర్ కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి !
March 26, 2025
0
Tags