జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడారు. స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి కోయిచి వకట. ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు జీరో గ్రావిటీని ఉపయోగించి బేస్ బాల్ ఆడారు. తానే బాల్ విసిరి మళ్లీ తానే షాట్ కొట్టిన వీడియోను కోయిచి పంచుకున్నారు. 'ఇది బేస్‌బాల్ సీజన్. మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ జపాన్‌లో ప్రారంభమవుతోంది. ఎక్స్‌పెడిషన్ 68 సమయంలో ఐఎస్ఎస్‌లో బేస్‌బాల్ ఆడాను. జీరో గ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టుతో పని లేదు' అని ఆయన పోస్టుకి రాసుకొచ్చారు. ఈ వీడియోను మస్క్ రీపోస్టు చేశారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కోయిచి వకాటా వ్యోమగామిగా ఉన్నారు. 2024లో జేఏఎక్స్ఏ నుంచి రిటైర్ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్ఎస్‌కు వెళ్లిన కోయిచి మొత్తంగా 500 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఎక్స్‌పెడిషన్ 39 సమయంలో ఐఎస్ఎస్‌లో తొలి జపనీస్ కమాండర్‌గా నిలిచారు.
అంతరిక్షంలో బేస్‌బాల్ ఆడిన వ్యోమగామి : వీడియో వైరల్
March 26, 2025
0
Tags