ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని, హత్యకు గురైన వ్యక్తి హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మిగిలిన డెడ్ బాడీలోని అవయవ భాగాలను అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలో పోలీసులు కనుగొన్నారు. ఈ మిస్టరీ కేసును పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. హత్య ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. చనిపోయిన వ్యక్తి హిజ్రా దిలీఫ్ అలీయాస్ దీపుగా గుర్తించిన పోలీసులు. అతను నాలుగేళ్లుగా బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులాపల్లి లో నివాసం ఉంటూ సహజీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. దీపు సహజీవనం చేస్తున్నట్టు తోటి హిజ్రాలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. కాగా బన్నీనే హిజ్రాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన తగాదాలు హత్య కు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపు చాలాకాలంగా హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటుందని తోటి హిజ్రాలు తెలిపారు. హిజ్రా హత్యలో నిందితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీడిన అనకాపల్లి హత్య కేసు మిస్టరీ ?
March 19, 2025
0
Tags