అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో హైదరాబాద్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి ఉద్యోగం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. సాయి దివేశ్ విద్యాభ్యాసం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్‌లోనే కొనసాగింది. ఇంటర్‌లో మెరుగైన స్కోరు సాధించి ఎన్‌ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ అభ్యసించారు. అక్కడే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అనంతరం లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేసిన దివేశ్ చౌదరి ఎన్విడియా కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
ఎన్విడియాలో రూ.3 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన హైదరాబాదీ !
March 19, 2025
0
Tags