తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకి, అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం అందింది. దీంతో ఈ ఇద్దరు నిందితులను భారత్‌కు రప్పించడానికి మార్గం సుగమమైంది. తెలంగాణలో కిందటి ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుతోపాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావుల (టీవీ చానెల్ మాజీ ఓనర్)పై సిట్ దృష్టిసారించింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలన్నా.. ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరమేర్పడిందని దర్యాప్తు బృందం చెబుతోంది. ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. స్వదేశం తీసుకొచ్చేందుకు రాష్ట్ర హోం శాఖ.. కేంద్ర హోం శాఖ సమన్వయంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈలోపు మిగతా నిందితులందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్ నోటీసులు !
March 19, 2025
0
Tags