నాగ్ పూర్ లో కొనసాగుతున్న కర్ఫ్యూ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాగ్ పూర్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉందని, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని బుధవారం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మధ్యాహ్నం పరిస్థితిని సమీక్షించి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 2,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించామని, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టి), అల్లర్ల నియంత్రణ పోలీసులు (ఆర్సిపి) డిసిపి ర్యాంక్ అధికారి నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయని అన్నారు. హింసాకాండకు సంబంధించి 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఐదు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని సీనియర్ అధికారులు తెలిపారు. జౌరంగజేబు సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ విహెచ్ పి, బజరంగ్ దళ్ సోమవారం నిర్వహించిన ప్రదర్శన హింసాకాండకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో పలు వాహనాలు దగ్ధం కాగా, 34 మందికి పైగా పోలీసులు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)