మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నివాసాల్లో సీబీఐ సోదాలు !

Telugu Lo Computer
0


హదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ రాయ్‌పూర్, భిలాయ్‌ నివాసాల్లో సీబీఐ నేటి ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. బఘేల్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై బఘేల్ కార్యాలయం ట్వీట్ చేసింది. "భూపేశ్ బఘేల్ ఈ రోజు కాంగ్రెస్ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశానికి హాజరవ్వడ కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనే సీబీఐ రాయ్‌పూర్, బిలాయ్ నివాసాల్లో సోదాలు నిర్వహించేందుకు వచ్చింది" అంటూ ట్వీట్ చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా  గతంలోనే ఈడీ సుమారు 2,295 వేల కోట్ల రూపాయలను సీజ్ చేసి అటాచ్ చేసింది. ఇక ఇటీవల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్, అతని కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా వారు 30 లక్షల రూపాయల నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేడు జరిగిన సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించే ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)