ఒడిషాలో సస్పెండైన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

Telugu Lo Computer
0


డిషా అసెంబ్లీలో సస్పెండైన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన రెండో రోజు కొనసాగుతుంది. భువనేశ్వర్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని, దీనిపై సభలో హోస్ కమిటీ వేర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభాపతి 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అక్కడినుంచి బయటకు పంపించారు. పోలీసుల తీరు పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. పలువురు అధికారులు తమపై దాడి చేశారని, ఇలాంటి పరిస్థితి తన జీవితంలో ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. హోస్ కమిటీ వేయకుండా అధికార పార్టీ రాజకీయం చేస్తోందని, కమిటీ వేస్తే నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతుందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)