ఆంధ్రప్రదేశ్‌లో బర్లిపేట ద్వారపూడికి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మౌనిక పాము కాటు కారణంగా మరణించింది. మంగళవారం సాయంత్రం ఆమె తన ఇంటి బయట వరండాలో కుర్చీపై కూర్చుని తన మొబైల్ ఫోన్ చూస్తుండగా, కుర్చీ కింద వున్న నాగుపాము కరిచింది. తనను పాము కాటు వేసిందని తెలుసుకున్న వెంటనే మౌనిక తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మౌనిక మరణించింది. మౌనిక నెల్లిమర్లలోని ఫిర్యాదు ఆధారంగా గుర్ల ఎస్ఐ నారాయణరావు బుధవారం కేసు నమోదు చేశారు.
పాము కాటుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి
March 21, 2025
0
Tags