నటి రజిత తల్లి విజయ లక్ష్మి (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మికి చెల్లెళ్లు అవుతారు. విజయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రజిత 18 ఏళ్ల వయసులోనే వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆమె నటించిన మొదటి సినిమా బ్రహ్మ రుద్రులు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కూతురిగా నటించింది. ఆ తర్వాత సహాయనటిగా తెలుగులో దాదాపు 200 సినిమాలు చేసింది. పెళ్లి కానుక సినిమాకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డు అందుకుంది.
నటి రజితకు మాతృవియోగం
March 21, 2025
0