వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ఉండి మండలంలో ఓ వివాహితపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన కోరికను తీర్చకుంటే భర్తను చంపేస్తామంటూ బెదిరించి ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రాక్షస క్రీడకు పాల్పడ్డారు. నగ్నంగా వీడియోలు తీసి డబ్బులు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. ఆ దుర్మార్గుల టార్చర్ తట్టుకోలేక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో పై అధికారులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగారు. ఈ మేరకు బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలానికి చెందిన వివాహితపై అదే ప్రాంతానికి చెందిన యర్రం శెట్టి రవి, సోమేశ్వరరావు అలియాస్ సోము అనుచితంగా వ్యవహరించారు. ఆమెను బలవంతంగా లోబర్చుకోవాలని చూశారు. మాట వినకపోతే భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో అత్యాచారానికి పాల్పడ్డారు. పేరుపాలెం సముద్రతీరానికి, భీమవరంలోని స్నేహితుల రూములకు తీసుకెళ్లి అనుభవించారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసిన దుర్మార్గులు బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. బాధితురాలిని బెదిరించి విడతల వారీగా ఇప్పటికే రూ.2.50 లక్షలు తీసుకున్నారు. మళ్లీ డబ్బు కావాలని వేధింపులు మొదలుపెట్టారు. బాధితురాలు వారి వేధింపులు భరించలేక కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నెల 1న ఉండి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని కోరింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. రాజీకి రావాలని, లేదంటే కౌంటర్ కేసు పెడతామని పోలీసులు బెదిరించినట్లు బాధితురాలి కుటుంబం తెలిపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు, వారి కటుంబ సభ్యులు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు రేంజ్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఐజీ అశోక్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)