ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం !

Telugu Lo Computer
0


టర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది. ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌తోపాటు ఇద్దరు కమిషనర్లు, అలాగే కేంద్ర హోం శాఖ కార్యదర్శితోపాటు ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)