ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మంగళగిరి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో గత బుధవారం విచారణకు సీఐడీ అధికారులు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు. కాగా కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని గతంలో మంగళగిరి సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారా, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే విషయాలపై అధికారులు విచారణ జరిపారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి,ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా ఉన్నారు. గతంలో ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు.
విజయసాయి రెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు
March 18, 2025
0
Tags