నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్ ప్రెస్ రద్దు

Telugu Lo Computer
0


సామర్లకోట - రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గంటూరు - విశాఖ సింహాద్రి ఎక్స్ ప్రెస్ అదే విధంగా ఈ నెల 24,25 తేదీల్లో విశాఖ - గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను రెండు వైపు లా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకు న్న వారు ఈ మార్పులు గమనించాలని అధికారులు సూచించారు. తాజాగా రైల్వే అధికారులు సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే నాలుగు ప్రధాన రైళ్లను చర్లపల్లి వరకే నడుపుతున్నారు. ఇక, ఇప్పుడు విశాఖ నుంచి లింగంపల్లికి రాకపోక లు సాగించే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సికింద్రాబాద్ లో స్టాపు ను రద్దు చేసారు. విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కు సికింద్రాబాద్‌లో స్టాప్‌ను రద్దు చేశారు. ఏప్రిల్‌ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 25 నుంచి సికింద్రాబాద్‌, బేగంపేట్‌ స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు తెలిపారు. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైలుకు కొద్ది రోజుల క్రితం కోచ్ ల సంఖ్య పెంచారు. ఇంకా రద్దీ కొనసాగుతోంది. ఈ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తుండటం పైన ప్రయాణీకుల్లో అసహనం కనిపిస్తోంది. ఈ వందేభారత్ కోసం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సికింద్రాబాద్ స్టాపు రద్దు చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావటంతో సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే పలు ప్రధాన రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసారు. అందులో భాగంగా విశాఖ, చెన్నై నుంచి పలు రైళ్లల్లో ఈ కొత్త నిర్ణయాలు అమల్లోకి తెస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)