కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా !

Telugu Lo Computer
0


ర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును అంసెబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టారు.ది కర్ణాటక ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ పబ్లిక్‌ ప్రోక్యూర్‌మెంట్‌ (కెటిపిపి) (అమెండ్మెంట్‌) బిల్‌ 2025ను రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ ఎఫైర్స్‌ శాఖ మంత్రి హెచ్‌ కె పాటిల్‌ ప్రవేశపెట్టారు. 7న 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సందర్భంలో ఈ బిల్లు ప్రతిపాదన గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటిసారిగా వెల్లడించారు. ఈ నెల 14న రాష్ట్ర కేబినేట్‌ సమావేశంలో కెటిపిపి బిల్లుకు సవరణలు ఆమోదించారు. దీని ప్రకారం రూ.2 కోట్ల వరకూ విలువైన ప్రజా పనులు, రూ. 1 కోటి వరకూ విలువైన వస్తు, సేవల కాంట్రాక్టుల్లో 4 శాతం ముస్లింలకు కేటాయిస్తారు. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు 24 శాతం, ఒబిసి కేటగిరి 1కు 4 శాతం, ఒబిసి కేటగిరి 2ఎకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. తాజా ప్రతిపాదనను కోర్టులో సవాలు చేస్తామని బిజెపి ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)