కాల్ మెర్జింగ్ స్కామ్ : కేంద్రం సూచనలు జారీ !

Telugu Lo Computer
0


సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసం చేస్తూ జనాలను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాల్ మెర్జింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూపీఐ వినియోగదారులు ఈ మోసానికి గురికావచ్చని కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్‌ను అమలు చేస్తారని వెల్లడించింది. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. సాధారణంగా మనం ఆన్‌లైన్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు OTP అవసరం అవుతుంది. కానీ, సైబర్ నేరగాళ్లు ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ద్వారా వినియోగదారుల నుంచి OTP దొంగిలించి, వారి బ్యాంక్ ఖాతాల నుంచి మనీ లాగేస్తుంటారు. నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో స్కామర్లు కాల్ చేస్తారు. ఆ క్రమంలో నటిస్తూ బాధితుడి నంబర్‌ను మీ స్నేహితుడి ద్వారా పొందామని చెబుతారు. ఆ తర్వాత బాధితుడికి మరొక ఇన్‌కమింగ్ కాల్‌ వస్తుందని, దానిని మెర్జింగ్ చేయాలని కోరతారు. నిజానికి, ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంక్ నుంచి వచ్చే OTP ఆటోమేటెడ్ కాల్. ఆ సమయంలో కాల్‌ను మెర్జ్ చేయడం ద్వారా, స్కామర్ OTP వివరాలను స్వీకరిస్తాడు. చివరకు ఆ OTPను ఉపయోగించి, స్కామర్ బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును లూటీ చేస్తాడు. ఇది సాధారణంగా ఆత్మీయుల ద్వారా వచ్చిన కాల్‌ అంటూ ఫోన్స్ చేస్తారు. కాబట్టి చాలా మంది దీని పట్ల అవగాహన లేకుండా మోసపోతారు. బాధితుడు ఈ మోసాన్ని గ్రహించేలోపు అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. OTP లేకుండా లావాదేవీలు సాధ్యపడవు. కానీ ఈ స్కామ్ ద్వారా OTPను దొంగిలించడం చాలా సులభంగా మారుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)