ఇండియన్ ప్రీమియం లీగ్ 2025 (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఉచితంగా వీక్షించిన అభిమానులకు జియోహాట్‌స్టార్ విలీనం రూపంలో షాక్ తగిలింది. మ్యాచ్‌ల కోసం కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎంపిక చేసిన ప్లాన్లపై జియో యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చని ప్రకటించింది. రూ.299, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్‌లపై ఈ ఆఫర్ అందిస్తున్నారు. పాత, కొత్త యూజర్లు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ప్రసారాలను ఉచితంగా వీక్షించొచ్చు. మొబైల్, టీవీల్లో 4కే స్ట్రీమింగ్ సేవలు పొందొచ్చు. దీంతో పాటు 50 రోజుల జియో ఫైబర్ సేవలను కూడా ఉచితంగా అందుకోవచ్చని రిలయన్స్ జియో వెల్లడించింది. ఇందులో అపరిమిత వైఫై, 800ప్లస్ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చు. మార్చి 17 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే, కాంప్లిమెంటరీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే మార్చి 22న యాక్టివేట్ అయ్యి 90 రోజుల పాటు సేవలు లభిస్తాయి. ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.100 ప్లాన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. దీని రీఛార్జితో 5జీబీ డేటా అందిస్తోంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. అంటే ఎటువంటి కాల్స్, ఎస్సెమ్మెస్‌ల సదుపాయం ఇందులో ఉండదు. ఇక, రూ.949 ప్లాన్ పైనా ఇలాంటి ఆఫర్ అందిస్తుండగా.. తాజాగా మరిన్ని ప్లాన్లకు ఈ కాంప్లిమెంటరీ సేవలను విస్తరించింది.
జియో యూజర్లకు ఎంపిక చేసిన ప్లాన్లపై 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ !
March 17, 2025
0
Tags