చంద్రునిపై అధ్యయనం చేయడానికి ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన గౌరవార్థం చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగాలపై కీలక వివరాలు తెలిపారు. చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని, జపాన్ సహకారంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు. చంద్రయాన్-5 ఇదివరకటి మిషన్‌ల కంటే అత్యంత ప్రత్యేకమైందని ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి 2023లో ప్రయోగించిన చంద్రయాన్-3 25 కిలోల బరువున్న 'ప్రజ్ఞాన్' రోవర్‌ను మోసుకెళ్లగా, చంద్రయాన్-5 ఏకంగా 250 కిలోల రోవర్‌ను మోసుకెళ్తుందని అన్నారు. మూడు రోజుల క్రితమే మాకు చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం నుంచి ఆమోదం లభించిందని, జపాన్‌తో కలిసి ఈ ప్రయోగం నిర్వహిస్తామని నారాయణన్ వెల్లడించారు. 2027లో చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుని నుంచి సేకరించిన నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో భవిష్యత్తులో గగన్‌యాన్ సహా వివిధ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతదేశం స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడమూ ఈ మిషన్లలో ప్రధానమైనది.
చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం !
March 17, 2025
0
Tags