లలిత్ మోడి భారతదేశంలో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టి వనువాటు పారిపోయాడు. లలిత్ మోడీకి జారీ చేసిన వనువాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని వనువాటు ప్రధాన మంత్రి జోథమ్ నపట్ సోమవారం పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. లలిత్ మోడీ సిటిజన్‌షిప్ రద్దు చేస్తున్నట్లుగా వనువాటు దినపత్రిక వనువాటు డైలీ పోస్ట్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది. నివేదిక ప్రకారం ఇదంతా భారతదేశం ఒత్తిడి చేయడం వల్లే జరిగినట్లుగా తెలుస్తోంది. లలిత్ మోడీ పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించారు. అయితే లలిత్ మోడీకి ఎందుకు సిటిజన్‌షిప్ ఇచ్చిందో.. ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే దానిపై స్పష్టత ఇచ్చింది వనువాటు డైలీ. 'అంతర్జాతీయ మీడియాలో ఇటీవల వెల్లడైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వనువాటు డైలీ పోస్ట్ రాసింది. మరింత సమాచారం అతిత్వరలోనే తమ వార్తాపత్రికలో అందిస్తామని పేర్కొంది. ఏ ప్రకటన గురించి మాట్లాడుతున్నారో చెప్పబడలేదు. అయితే లలిత్ మోడీ పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త అని వనువాటుకు తరువాత తెలిసిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని నమ్ముతారు. భారతదేశంలో వేల కోట్లలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు లలిత్ మోడీ. ఆయనతో పాటు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి పేరు మోసిన వ్యాపారవేత్తలు ఈజాబితాలో ఉన్నారు. దేశ సంపద లూటీ చేసి పరాయి దేశాల్లో హాయిగా జీవిస్తున్న వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదని విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శలు చేయడంో కేంద్రం ఈదిశగా చర్యలు చేపట్టింది.
లలిత్ మోడీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన వనువాటు ప్రభుత్వం !
March 10, 2025
0
Tags