అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వందే భారత్ రైలును మహిళా డ్రైవర్లు నడిపారు. ఈ రైలు ఈరోజు ఉదయం 6.20 నిమిషాలకు బయలుదేరింది. మహిళా సిబ్బందితో కూడిన ఈ వందేభారత్ రైలు ముంబైలోని సిఎస్‌ఎంటి రైల్వే స్టేషన్ నుంచి షిర్డికి ప్రయాణించింది. ఆసియా తొలి మహిళా లోకో పైలెట్ సురేఖా యాదవ్, అసిస్టెంట్ లోకో పైలెట్ సంగీత కుమారి ఆ రైలుకు డ్రైవర్లుగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా కీలకమైన రైల్వేశాఖలో కూడా మహిళల పాత్ర పెరుగుతుందని దీన్నిబట్టే తెలుస్తోంది. ఈ వందేభారత్ రైలులో టీటీఈలు అందరూ కూడా మహిళలే ఉన్నారు. హెడ్ టికెట్ ఎగ్జామినర్ అనుష్కా కేపీ, ఎంజే రాజ్‌పుత్, సీనియర్ టికెట్ ఎగ్జామినర్ సారికా ఓజా, సువర్ణా పాస్తే, కవితా మారల్, మనిషా రామ్ ఈ రైలులో విధులు నిర్వహించారు.
మహిళా సిబ్బందితో వందే భారత్ రైలు !
March 08, 2025
0
Tags