ఉత్తరప్రదేశ్లోని కుందా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యాపై గృహహింస కేసు నమోదైంది. ఆయన సతీమణి భన్వి సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ లోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మార్చి 7న ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. రాజా భయ్యా కొన్నేళ్లుగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. కుందా నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాభయ్యా.. గతంలో భాజపా, సమాజ్‌వాదీ పార్టీల నుంచి మంత్రిగానూ పనిచేశారు. 2018లో జనసత్తా దళ్(లోక్‌తంత్రిక్) పార్టీని స్థాపించారు. అయితే, గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. తన అత్తతో పాటు మిగతా వారు వేధింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. తన వివాహ బంధాన్ని కాపాడుకొనేందుకు తొలుత ఆమె చట్టపరమైన చర్యకు దూరంగా ఉన్నారని.. వేధింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి రాజా భయ్యాపై గృహ హింస కేసు నమోదు
March 09, 2025
0
Tags