గురుగ్రామ్‌లో 14వ అంతస్తు నుంచి పడి జపాన్‌ మహిళ మృతి

Telugu Lo Computer
0


గురుగ్రామ్‌లో జపాన్‌కు చెందిన ఓ మహిళ 14వ అంతస్తు బాల్కనీ నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. గతేడాది భారత్‌కు వచ్చిన ఈమె, భర్తతో సహా ఢిల్లీ శివారులో నివాసముంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మడోకో థమానో (34) అనే మహిళ భర్తతో కలిసి గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గురుగ్రామ్‌లోని ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు. అయితే, మార్చి 8న ఉదయం అపార్టుమెంటు ఆవరణలో రక్తపు మడుగులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి జపాన్‌ రాయబార కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)