ఒడిశాలోని చాందీపుర్ ప్రాంతంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమీపగ్రామాలలో నివసిస్తున్న సుమారు 32,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. ఐటీఆర్ లాంచ్ ప్యాడ్ -3 నుంచి దగ్గరగా ఉన్న ఆరు గ్రామాల ప్రజలను బుధవారం తెల్లవారుజామున సమీపంలోని మూడు ప్రభుత్వ కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. క్షిపణి పరీక్షలు ముగిసే వరకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉండాలని సూచించింది. వారి వసతి, ఇతర అవసరాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ప్రజల అవసరాలు, బాగోగులు చూడడానికి వంద మందికిపైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.
క్షిపణి పరీక్ష కోసం 32 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు !
March 26, 2025
0
Tags