త్వరలో నిస్సాన్ నుంచి 5 సీటర్, 7 సీటర్ కార్లు ?

Telugu Lo Computer
0

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మరో రెండు కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో ఒకటి 5 సీటర్, మరొకటి 7 సీటర్. వీటిని కంపెనీ 2026లో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లోని యోకోహామాలో ఇటీవల ముగిసిన గ్లోబల్ ప్రొడక్ట్ షోకేస్ ఈవెంట్‌లో నిస్సాన్ కంపెనీ భారతదేశం కోసం తీసుకురానున్న రెండు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. ఇప్పుడున్న బ్రాండ్ మోడల్స్ కంటే భిన్నంగా, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈ కార్లకు సంబంధించిన వివరాలు వెల్లడికావాల్సి ఉంది. వీటిని కంపెనీ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)