ఎంఎంటీఎస్‌ మహిళల బోగీల్లో పోలీసు పహారా !

Telugu Lo Computer
0


ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఇటీవల మేడ్చల్‌ వెళుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆదేశాల మేరకు ఉదయం, రాత్రి వేళల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లలోని ప్రతీ మహిళా బోగీకి ఒకరిద్దరు ఆర్పీఎఫ్‌ లేదా జీఆర్‌పీఎఫ్‌ మహిళా పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 6.10గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు బయల్దేరిన ఎంఎంటీఎస్‏లో పోలీసు సిబ్బంది స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)