కాంగోలో పడవ బోల్తా పడి 25 మంది మృతి ?

Telugu Lo Computer
0


కాంగో పశ్చిమ ప్రావీన్సులో క్వా నదిలో పడవ బోల్తా పడి 25 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గల్లంతయ్యారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సాకర్ ఆటగాళ్లే ఉన్నారు. ముషి పట్టణంలో మ్యాచ్ ఆడి ఇతర ప్రయాణికులతో కలిసి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ నీటిలో మునిగి పోయిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ముసాషి ఓడరేవు నుంచి బోటు బయలుదేరిన కాసేపటికే బోల్తా పడినట్టు తెలిపాయి. రాత్రి పూట దృశ్యమానత సరిగా లేకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)