జిందాల్ రెన్యూవబుల్స్ నుంచి సుజ్లాన్ కు 204.75 మెగావాట్ల పవన విద్యుత్‌ ఆర్డర్‌ !

Telugu Lo Computer
0


జిందాల్ రెన్యూవబుల్స్ నుంచి 204.75 మెగావాట్ల పవన విద్యుత్‌ ఆర్డర్‌ను పొందినట్లు సుజ్లాన్ తెలిపింది. సుజ్లాన్, 65 అత్యాధునిక S144 విండ్ టర్బైన్ జనరేటర్లను హైబ్రిడ్ లాటిస్ టవర్స్ తో సరఫరా చేస్తుందని, ప్రతి ఒక్కటి 3.15 MW సామర్థ్యంతో పనిచేస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో ఇది అమలు చేస్తారు. అంతకుముందు, సుజ్లాన్..ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని జిందాల్ స్టీల్ ప్లాంట్‌లకు 702.45 మెగావాట్ల పవన విద్యుత్తును అందించడానికి రెండు ఆర్డర్‌లను పొందింది. ప్రస్తుతం, సుజ్లాన్‌కు సంబంధించిన మొత్తం ఆర్డర్ బుక్‌లో వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు 59 శాతం ఉన్నారు. ఇది ఇప్పుడు కంపెనీ చరిత్రలో అత్యధికంగా 5.90 GWకు చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)