రోడ్డుపై అత్తాకోడళ్లు ఫైటింగ్ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు. ఈ అత్తాకోడళ్లు యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్‌లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)