హైదరాబాద్ లో ఇద్దరు బాలికలపై పెట్రోల్ దాడి ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పియస్ పరిధి జై రామ్ నగర్ కాలనీ లో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు (ముగ్గురు బాలురు, ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు బాలికలపై పెట్రోల్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక బాలిక (10)కు తీవ్ర గాయలు కాగా మరో బాలిక (9)కు స్వల్ప గాయాలైనవి. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఇద్దరు బాలికలను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మైనర్ లకు పెట్రోల్ డబ్బా తో పాటు అగ్గిపెట్టే ఎక్కడి నుండి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)