జిమ్మీకార్టర్‌కు మరణానంతరం గ్రామీ పురస్కారం !

Telugu Lo Computer
0


మెరికా లోని లాస్ఏంజెలెస్‌ ఏంజెలెస్‌ వేదికగా గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.  ఈ వేడుకలో పేరుపొందిన సింగర్స్‌, మ్యూజిక్ డైరెక్టర్స్‌ సందడి చేశారు. ఈ వేడుకల్లో ఇండో-అమెరికన్‌ సింగర్‌, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ అవార్డు అందుకున్నారు. ఆమె రూపొందించిన 'త్రివేణి' ఆల్బమ్‌ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది. దీనిపై ఆమె ఆనందం వ్యక్తంచేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. చంద్రికకు ఇది రెండో గ్రామీ నామినేషన్‌ కావడం విశేషం. దీనిపై ఆమె స్పందిస్తూ.. ''చాలా అద్భుతంగా ఉంది. ఈ విభాగంలో నాతోపాటు ఎంతోమంది గొప్ప గాయనీ గాయకులు, కంపోజర్లు నామినేట్‌ అయ్యారు. వారందరితో పాటు నేనూ విజయాన్ని అందుకోవడం సంతోషంగా అనిపిస్తుంది'' అని తెలిపారు. చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీకి చంద్రిక సోదరి అవుతారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌ మరణానంతరం ఆయనను గ్రామీ పురస్కారం వరించింది. ఆయన రచించిన 'ది లాస్ట్‌ సండేస్‌ ఇన్‌ ప్లేన్స్‌'కు బెస్ట్‌ ఆడియోబుక్‌ నెరేషన్‌ విభాగంలో అవార్డు లభించింది. జిమ్మీకార్టర్‌ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మనవడు జేసన్‌ కార్టర్‌ ఈ అవార్డును అందుకున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)