భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో దేశీయ సూచీలు సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ వారంలో 5,6 తేదీలలో ఆర్బీఐ ద్రవ్యపరపతి మీటింగ్ జరగనుంది. కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఆదాయపు పన్ను తగ్గింపు కారణంగా ఏఫ్‌ఎమ్‌సీజీ, బడ్జెట్ కేటాయింపుల వల్ల వ్యవసాయ ఆధారిత స్టాక్స్ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. శనివారం ముగింపుతో పోల్చుకుంటే సోమవారం ఉదయం 500 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 750 పాయింట్లు కోల్పోయి 76, 756 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో 672 పాయింట్లు కోల్పోయి 76, 833 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 239 పాయింట్ల నష్టంతో 23, 243 వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)