కృత్రిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా 'డీప్‌సీక్'.. దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈనేపథ్యంలోనే అమెరికా టెక్ సంస్థ 'ఓపెన్ ఏఐ' కీలక ప్రకటన చేసింది. 'డీప్ రీసెర్చ్' పేరుతో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. మనిషి చాలా గంటల్లో చేసే పనిని ఈ కొత్త టూల్ పది నిమిషాల్లోనే చేసి పెడుతుందని కంపెనీ వెల్లడించింది. ''ఓపెన్ ఏఐ తదుపరి ఏజెంట్ డీప్ రీసెర్చ్ స్వతంత్రంగా పని చేయగలదు. మీరు ప్రాంప్ట్ ఇస్తే చాట్‌జీపీటీనే వందలాది ఆన్‌లైన్ సోర్సులను విశ్లేషించి రీసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో సమగ్ర నివేదిక రూపొందిస్తుంది'' అని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో ఉన్నతస్థాయి సమావేశానికి ముందు కంపెనీ ఈ టూల్‌ను ఆవిష్కరించింది. ఓపెన్‌ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్‌మన్ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, టెక్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అధినేత మసయోషి సన్‌తో ఆయన చర్చలు జరపనున్నారు. ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్ కలిసి 'స్టార్‌గేట్' పేరుతో సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
'డీప్ రీసెర్చ్' టూల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ
February 03, 2025
0
Tags