దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్ షా ఇచ్చిన ప్రకటన దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే ఉద్దేశపూర్వక యత్నమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన ప్రకటన అవిశ్వాసనీయమైనది, తప్పు దారి పట్టించేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా కోల్పోవని అమిత్షా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమిత్షా ప్రకటన మరింత ఆందోళనకరం, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలను అణచివేసే ఉద్దేశపూర్వక యత్నమని సిద్ధరామయ్య మండిపడ్డారు. గతంలో పునర్విభజన ప్రక్రియ 1971 జన గణనను దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి యత్నాలను గుర్తించడానికి, న్యాయబద్ధతను నిర్థారించేందుకు వినియోగించేవారని అన్నారు. ప్రస్తుత పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. బిజెపి ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని బలహీన పరిచే సాధనంగా డీలిమిటేషన్ను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సిద్ధరామయ్య అన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్య కూటమి ఏర్పాటుపై ఇప్పటికేచర్చలు జరుగుతున్నాయని, అనైతికమైన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ త్వరలో సంయుక్తంగా ఆందోళన చేపడతామని అన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే ఉద్దేశపూర్వక యత్నం !
February 27, 2025
0
Tags