మార్చి 1న 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ స్ట్రీమింగ్ !

Telugu Lo Computer
0
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్ తో పాటు జీ5 ఓటీటీలోనూ ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ తాజాగా తన యాప్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రోమో ద్వారా తెలియజేసింది. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా నిడివిని దృష్టిలో ఉంచుకొని తొలగించిన కొన్ని హాస్య సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జత చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)