రీల్స్‌ కోసం ఇన్‌స్టా ప్రత్యేక యాప్‌ ?

Telugu Lo Computer
0

                                          

ఇన్‌స్టా రీల్స్‌ కోసమే ప్రత్యేకంగా యాప్‌ను తీసుకురావాలని మెటా సంస్థ చూస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మొస్సేరి ఇప్పటికే ఈ విషయాన్ని తమ సిబ్బందికి తెలిపినట్లు సమచారం. రీల్స్‌లో 3 నిమిషాల వీడియోలు కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా టిక్‌టాక్‌ తరహాలోనే వర్టికల్‌గా స్క్రోల్‌ కానుంది అమెరికాలో టిక్‌టాక్‌ ఇటీవల నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టాక పునరుజ్జీవం పోసుకుంది. ఇప్పటికీ నిషేధం కత్తి వెంటాడుతోంది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌లో 50 శాతం వాటాను అమెరికా సంస్థకు అమ్మేస్తే దానికి అనుకూలంగా నిర్ణయం ఉంటుందని ట్రంప్‌ స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 5లోగా దాని భవితవ్యం తేలనుంది. ఈ క్రమంలో కొత్త యాప్‌ గురించి ఇన్‌స్టా ఆలోచన చేస్తుండడం గమనార్హం. క్రియేటర్ల కోసం గత నెల ఎడిట్స్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఐఓఎస్‌ యూజర్లకు ఈ యాప్‌ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. ఒకవేళ రీల్స్‌ యాప్‌ కూడా వస్తే ఈ ఏడాదిలో మెటా నుంచి వచ్చిన రెండో యాప్‌ రీల్స్‌ కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)