బీఆర్ ఎస్ ప్రభుత్వం టన్నెల్‌లో నీటి తొలగింపు పనులు కూడా చేపట్టలేదు !

Telugu Lo Computer
0


ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండు నెలల్లో తిరిగి సొరంగం తవ్వకం పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ''గత ప్రభుత్వం టన్నెల్‌లో నీటి తొలగింపు పనులు కూడా చేపట్టలేదు. టన్నెల్‌లో నీటిని తోడివేసి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగేది కాదు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కకు పెట్టారు. టన్నెల్‌ పూర్తి చేసి ఉంటే 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. భారాస చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ల జేబులు నింపుకొనేందుకే. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే అది మూడేళ్లకే కూలింది. గతంలో శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు చనిపోతే కనీసం వెళ్లి చూడలేదు. పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోతే స్పందించలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే నాడు కేసీఆర్‌ వెళ్లలేదు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ దగ్గర్లోనే మాసాయిపేట రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదు. ప్రమాదం జరిగిన చోట రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారు. హరీశ్‌రావుకు అనుభవం ఉంటే పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు. నిపుణుల చర్యలకు ఇబ్బంది కావొద్దని అందరినీ లోపలికి పంపట్లేదు. టీబీఎం వెనుక ఉన్న బురద తొలగింపు పనులు జరుగుతున్నాయి. బురద తొలగింపు పూర్తికాగానే మిషన్‌ శిథిలాలు తొలగిస్తాం'' అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)