మహా కుంభమేళాలో డిజిటల్ స్నానాలు ?

Telugu Lo Computer
0


మహా కుంభమేళాకు చాలా మంది వివిధ కారణాల వల్ల  రాలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. గంగా నదిలో పుణ్యస్నానాలను ఆచరించే భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి డిజిటల్ స్నానాలు చేయిస్తున్నాడు. కుంభమేళాకు హాజరుకాలేని భక్తులు వారి ఫోటోలను వాట్సాప్‌లో పంపాలని, వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని ఆ యువకుడు వెల్లడించాడు. తన స్టార్టప్ పేరు ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్ అని పేర్కొన్నాడు. ఇలాగే ఒక వ్యక్తికి తమ కుటుంబ సభ్యులతో డిజిటల్ స్నానం చేయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో డిజిటల్ స్నానాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. భక్తులు డిజిటల్ స్నానాల కోసం రూ. 1100 చెల్లించాలని, అప్పుడు వారి ఫొటోలను త్రివేణి సంగమంలో ముంచడం ద్వారా కుంభమేళాలో డిజిటల్ స్నానం ఆచరించేలా చేస్తామని తెలిపాడు. ఈ వ్యవహారంపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బిజినెస్ ఐడియా అదిరిపోయిందంటూ కొందరు, టెక్నాలజీని వాడేస్తున్నావ్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ అంశంపై కొందరు సీరియస్‌గా కామెంట్స్ చేస్తున్నారు. పవిత్ర స్నానాన్ని డబ్బు కోసం ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)