తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ ఎల్ బీ సీ పనులలో 3 మీటర్ల వద్ద పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్ఎల్ బీ సీ ప్రాజెక్టు పనులను నాలుగు రోజుల క్రితం ప్రారంభించారు.ఇవాళ సుమారు 50 మంది కార్మికులు సొరంగం పనులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టన్నెల్ పై భాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.
ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనుల్లో ప్రమాదం : ఏడుగురు కార్మికులకు గాయాలు
February 22, 2025
0
Tags