వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త ఇప్పటికే స్పష్టం చేసింది. శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం వెతకడం ప్రారంభించారు. లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా కోసం వెతుకుతున్నారు. అధికారిక నివాసం కోసం సీఎం సిబ్బంది మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఢిల్లీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఒకటి, రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ సీఎంవో అధికారులకు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని బంగ్లాలు సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉండగా, మరికొన్ని ఢిల్లీలోని లుటియెన్స్ లో ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ సీఎం ఏ బంగ్లాలో నివసించాలో నిర్ణయించుకోనున్నారు. ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల నివాసాలు, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం దేశ పరిపాలనా అధికార కేంద్రంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, సివిల్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)తో సహా గత ఆప్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ ప్రాంతంలో బంగ్లాలు కేటాయించబడ్డాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం వెతుకులాట !
February 22, 2025
0
Tags