పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన కేసులో, దివ్య ఫార్మసీ పతంజలి ఉత్పత్తులు అధిక రక్తపోటు , మధుమేహాన్ని నయం చేస్తాయని తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ఇది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం, 1954ను ఉల్లంఘిస్తోంది. దీనిపై కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా కోర్టు ఇంతకు ముందు బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ, వారు ఫిబ్రవరి 1 కోర్టుకు హాజరు కాలేకపోవడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది . పతంజలి ఉత్పత్తులు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని తప్పుదోవ పట్టించే ప్రకటనల ద్వారా ఔషధ ప్రకటన చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయింది. దీనిపై ఫిబ్రవరి 15న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. యోగా గురువు రామ్‌దేవ్‌ను గతంలో జనవరి 16న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత కోర్టు అదే రోజు బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, బెయిల్ కోసం ఫిబ్రవరి 1న స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. అటు కోజికోడ్ , హరిద్వార్ (ఉత్తరాఖండ్) లలో ఇలాంటి కేసులు కొనసాగుతున్నాయని, అనేక సమన్లు జారీ చేశారు, అయితే రామ్‌దేవ్, బాలకృష్ణ ఏ కేసులోనూ కోర్టుకు హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
February 02, 2025
0
Tags