తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్ అనేది చర్చనీయాంశం అయ్యింది. ఫేక్ ఐడెంటీ కార్డులతో సచివాలయంలోకి వస్తున్నారు. ఇలా రోజుకో నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది పట్టుకుంటున్నారు. ఈ రోజు మరో ఫేక్ ఉద్యోగిని పట్టుకున్నారు సెక్రటేరియట్ సెక్యూరిటీ. తాను తహసీల్దార్ అంటూ సచివాలయంలోకి కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి వచ్చాడు. అయితే ఈ తహసీల్దార్ అనే స్టిక్కర్ ఉన్న వాహనంలో గత కొద్దిరోజులుగా సచివాలయంలోకి అంజయ్య వస్తున్నాడు. దాంతో అనుమానం వచ్చి ఈ రోజు అంజయ్య ను పట్టుకున్నారు. అనంతరం అంజయ్యను సైఫాబాద్ పోలీసులకు అప్పగించి, అతని పై కేసు నమోదు చేసారు. పోలీసులు అంజయ్య వద్ద నుంచి ఫేక్ ఐడి స్వాధీనం చేసుకున్నారు. ఓ జిరాక్స్ సెంటర్ లో ఈ ఫేక్ ఐడి కార్డ్ తయారు చేపించినట్లు పోలీస్ విచారణలో అంజయ్య తెలిపాడు. దీంతో పోలీసులు ఈ ఫేక్ ఉద్యోగి దందాల పై విచారణ మొదలు పెట్టారు .
తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగిని పట్టివేత !
February 06, 2025
0
Tags