వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్ రావు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్ రావు (రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. విషయం తెలుసుకుకున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)