పాల బండి పైన కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో ఒక కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి మల్లారెడ్డి అక్కడ సందడి చేశారు. పాల డబ్బాతో కనిపించిన ఒక స్కూటర్ ను చూసిన ఆయన చటుకున స్కూటర్ పైన ఎక్కి కూర్చున్నారు. ఇక ఆ పాల బండిని చూసి తాను పాలు అమ్మిన రోజులను మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. పాల బండి పైన కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. పాల బండి ఎక్కి చేసిన సందడి కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని అని గుర్తు చేసుకున్న మల్లారెడ్డి మళ్లీ మరోమారు పాల బండి పై పాలు అమ్ముతూ సందడి చేశారు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పాలు అమ్మే వ్యక్తిని శాలువాతో సత్కరించిన మల్లారెడ్డి కష్టపడి పైకి రావాలని తన అభిమతాన్ని తన చర్యల ద్వారా తెలియజేశారు. గతంలో మల్లారెడ్డి స్కూటర్ పై పాలమ్మే స్థాయి నుంచి ఎన్నో విద్యాసంస్థలు, వ్యాపారాలతో ఉన్నత స్థాయికి చేరుకున్నానని తనదైన శైలిలో చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)