తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ ?

Telugu Lo Computer
0


తెలంగాణలో గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వ్యాధులు, వైరస్‌ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఏదైనా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత పోస్టు వైరల్‌ లేదా పోస్టు బ్యాక్టీరియల్‌ వ్యాధిగా కనిపించేది జీబీఎస్‌. ఇది మెదడు నుంచి దేహంలోని ప్రతీ భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్‌ అనే పొర ఉంటుంది. యాంటీ బాడీస్‌ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్‌ అందక అవయవాలు అచేతనంగా మారుతాయి. మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు క ండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టంగా ఉంటుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు. ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రం కండరాలకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతిచెందే అవకాశం ఉంది. గుండె స్పందనలు వేగంగా లేదా నెమ్మదిగా మారడం, బీజీ హెచ్చతగ్గులు, ముఖం నుంచి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరుగుతాయి. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులు తీవ్రంగా జ్వరం వస్తుంది మైలీన్‌ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలు పడుతుంది. శరీరంలో పొటాషియం, కాల్షియం తగ్గినా జీబీఎస్‌ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తొలగిపోతుంది. జీబీ సిండ్రోమ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్‌కు ప్రధాన కారణం. 

Post a Comment

0Comments

Post a Comment (0)