గూగుల్ మ్యాప్ ను నమ్మితే గమ్యానికి చేరాక పోగా, కారునే కొట్టేశారు ?

Telugu Lo Computer
0

                                        

కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అది చూపించిన విధంగా వెళ్తుంటాం. కానీ అదే గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ఓ వ్యక్తి మోసపోయాడు. ఉత్తర ప్రదేశ్ సహరాన్ పుర్ జిల్లాలోని దేవ్ బంద్ ప్రాంతంలో మీరట్ కు చెందిన ఫిరోజ్ ఫిబ్రవరి 5న షామిలీ అనే ప్రాంతానికి కారులో బయల్దేరాడు. ఫిరోజ్ తన ఫ్రెండ్ లియాఖత్ ను రోహానా టోల్ ప్లాజా వద్ద కలవాల్సి ఉంది. ఫిరోజ్ ను సహరాన్ పుర్ మీదుగా రావాలని లియాఖత్ లొకేషన్ సెండ్ చేశాడు. ఆ లొకేషన్ ప్రకారం ఫిరోజ్ జర్నీ ప్రారంభించాడు. అర్ధరాత్రి 2 గంటలకు అతడి కారు దారి తప్పి పొలం మధ్యలోకి వెళ్లి ఇరుక్కుపోయింది. వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించినా ఫిరోజ్ కారు పొలంలోనే దిగబడి పోయింది. ఫిరోజ్ కారు దిగి కేకలు వేయడం ప్రారంభించాడు. ఆయన కేకలు విన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి కారును బయటకు లాగారు. కారు బయటకు రాగానే ఓ వ్యక్తి ఫిరోజ్ కారుతో పరారయ్యాడు. మరో ఇద్దరు బైక్ పై ఉడాయించారు. దీంతో ఫిరోజ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అతని మొబైల్ కారులోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఈ ఘటనపై ఫిరోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సీసీటీవీలను పరిశీలించి నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)