మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్ : ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి !

Telugu Lo Computer
0


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపాడు. తాను ఊద్దేశ పూర్వకంగా రామ్‌చరణ్‌ను చులకన చేసి మాట్లాడలేదని, తన మాటల్ని మెగా అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని అరవింద్ తెలిపాడు.  రామ్ చరణ్ స్థాయి తగ్గించి మాట్లాడానని మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారని వాపోయారు. రీసెంట్‌గా జరిగిన తండేల్ ఈవెంట్‌లో తాను దిల్ రాజు గారి పరిస్థితిత గురించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పాడు అంతేకానీ రామ్ చరణ్ స్థాయిని తగ్గించాలని మాట్లాడలేనని చెప్పాడు. మూడు రోజులు ముందు రిలీజైన తండేల్ సినిమాకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ఈవెంట్‌లలో చురుకుగా పాల్గొన్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్‌లో తన మేనల్లుడు రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్ కంటే కూడా తక్కువగా ఆడిందని తెలిపాడు. అందుకే రెండో సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా.. మేనల్లుడికి బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని మగధీర సినిమా చేసినట్లు తెలిపాడు. నిజానికి ఆ సినిమాతో తను నష్టాల్లో కూరుకుపోతానని అనుకున్నానని, కానీ.. మగధీర అరివీర భయంకర హిట్టయిందని తెలిపాడు. అదే ఈవెంట్‌లో దిల్ రాజు గురించి కూడా మాట్లాడుతూ వారం రోజుల్లోనే ఆయన కష్టనష్టాలు చూశాడని అన్నాడు. దాంతో ఈ విషయాన్ని మెగా అభిమానులు.. కావాలనే అల్లు అరవింద్ అలా మాట్లాడాడని, రామ్ చరణ్‌ను కించపరిచాడని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనిపై తాజాగా స్పందించి.. రామ్ చరణ నాకున్న ఏకైక మేనల్లుడు. తనకు కొడుకులాంటి వాడు. చరణ్‌కు నేను ఏకైక మేనమామను. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మీ మనోభావాలు దెబ్బతినకుంటే నన్ను క్షమించండి. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అంటూ అల్లు అరవింద్ కోరాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)