ఢిల్లీ పరిధిలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది లేకుండా మెట్రో రైళ్లలో ప్రయాణించి ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లాలని సూచించింది. అయితే ఢిల్లీ పరిధిలోని అన్ని మెట్రో స్టేషన్లకు వచ్చే టెన్స్ విద్యార్థులు.. తమ ఎగ్జామ్ హాల్ టికెట్లు చూపించి సెక్యూరిటీ చెకింగ్స్ లేకుండానే నేరుగా వెళ్లి మెట్రో రైలు ఎక్కే సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. దీని వల్ల త్వరగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. టికెట్ ఆఫీస్ మెషీన్స్, కస్టమర్ కేర్ కేంద్రాల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపిస్తే.. వారికి మొదట ప్రాధాన్యత కల్పిస్తామని ఢిల్లీ మెట్రో వెల్లడించింది. దీంతో త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీలో సుమారు 3.30 లక్షల మంది సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అయితే ఫైనల్ పరీక్షల సమయంలో.. మెట్రో స్టేషన్లు, రైళ్లలో రద్దీ లేకుండా చూసేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇక విద్యార్థులంతా ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల సందర్భంగా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది.
టెన్త్ పరీక్షల విద్యార్థులకు ఢిల్లీ మెట్రో శుభవార్త !
February 14, 2025
0
Tags